ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం బెంగళూర్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు. ఇడుపులపాయలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కేడర్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ముందుగా జగన్ వైయస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌కు బయలు దేరారు. అనంతరం వైసీపీ వైయస్‌ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. పార్టీ నేతల మధ్య పలు విషయాల్లో అంతర్గత విబేధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ వాటిని చక్కదిద్దే పనిలో పడ్డారు.