Site icon

గోపీచంద్ ‘విశ్వం’ ఎలా ఉందంటే…

వినోదాత్మ‌క చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండి స్టార్ హీరోల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన స్టార్ డైరెక్ట‌ర్‌ శ్రీను వైట్ల. చాలా కాలం త‌ర్వాత శ్రీనువైట్ల త‌న మార్క్ డైరెక్ష‌న్ చూపించేందుకు మ‌రో మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. అదే గోపీచంద్ న‌టించిన విశ్వం. ఇస్మార్ట్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను చిత్రాలయ స్టూడియోస్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఈ మూవీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. భారీ క‌మెడీయ‌న్ల తారాగ‌ణంతో వ‌చ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఎంత మేర‌కు మెప్పించిందో చూసేయండి…

కథ: క‌ట్ చేస్తే… హైదరాబాద్‌లో ఓ రాజ‌కీయ నాయ‌కుడు హత్యకు గురవుతాడు. ఆ హత్యను ఓ చిన్నారి లైవ్‌లో చూస్తుంది. దీంతో ఆ చిన్నారిని చంపేందుకు హంతకులు ఆమెను వెంబడిస్తుంటారు.ఇదే స‌మ‌యంలో ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన హీరో ఆమెను పలుమార్లు ప్రమాదం నుంచి కాపాడ‌తాడు. ఈ క్ర‌మంలో చాలా సాహ‌సాలు చేస్తాడు. అస‌లు హీరో ఆ పాప‌ను ఎందుకు కాపాడాల‌నుకుంటున్నాడు? ఆ పాప కోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు? అనేదే అస‌లు క‌థ‌.

విశ్లేషణ: విశ్వం సినిమాపై భారీ అంచనాలున్న ఆడియెన్స్‌ను శ్రీనువైట్ల త‌న రొటీన్ క‌థ‌తోనే ప‌ల‌క‌రించాడు. టెర్రరిజం బ్యాక్ గ్రౌండ్ తీసుకొని ఓ చిన్నారిని లింక్ చేస్తూ కథను ఆస‌క్తి క‌రంగా ముందుకు తీసుకెళ్లాడు. సినిమాలో కొత్త ద‌నం ఏం లేక‌పోయినా కామెడీ ట్రాక్స్ తో ఆడియెన్స్ ను ఆక‌ట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ లో పృథ్వి, గోపీచంద్, నరేష్ మ‌ధ్య కామెడీ బాగా వ‌ర్కౌవుట్ అయ్యింది. సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత వచ్చే ట్రైన్ ఎపిసోడ్ కూడా బాగానే ఆక‌ట్టుకుంది. గ‌తంలో వెంకీ సినిమాతో ట్రైన్ ట్రాక్ లో బ్లాక్ బాస్ట‌ర్ కామెడీ అందించిన శ్రీనువైట్ల ఆ స్థాయిలో కాకున్నా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక సినిమాలో క‌థ ప‌రంగా రాబోయే ప్ర‌తి సీన్‌ను ప్రేక్ష‌కులు ముందే ఊహించేస్తారు. గోపీచంద్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. కామెడీతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లలో బాగా న‌టించాడు. కావ్య థాపర్ గ్లామర్ డోస్ పెంచింది.ఇక‌ వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, నరేష్, ప్రగతి సహా గిరి, షకలక శంకర్ వంటి వాళ్లు కనిపించింది కొద్దిసేపు కడుపుబ్బా నవ్వించారు. విలన్ పాత్రలో నటించిన జిషుస్సేన్ గుప్తా ప‌ర‌వాలేద‌నిపించాడు. సునీల్ పాత్ర కాస్త భిన్నం. కిక్ శ్యామ్ కి చాలా రోజుల తర్వాత కాస్త మంచి క్యారెక్ట‌ర్ దొరికింది. సినిమాకు హైలైట్‌గా న‌టించిన‌ చిన్నారి పాత్ర బాగుంటుంది. చైతన్ భరద్వాజ్ సాంగ్స్ న‌చ్చుతాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాను చాలా కలర్ ఫుల్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ గుహ‌న్‌ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఓవ‌రాల్‌గా మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత శ్రీనువైట్ల గ్రాఫ్ పెంచేందుకు ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంద‌ని చెప్పుకోవ‌చ్చు.

Share
Exit mobile version