స్టార్ హీరోయిన్ సాయి పల్లవి లేటెస్ట్ మూవీ అమరన్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా భారీగా అవార్డులు కూడా అందుకుంటోంది. తమిళనాడులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అమరన్ మూవీకి అవార్డుల పంట పండింది. హీరోయిన్ సాయిపల్లవి బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకోగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మహారాజ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అమరన్ సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో సైతం అవార్డు అందుకుంది. దీంతో పాటు అమరన్ చిత్రానికి ఉత్తమ ఎడిటర్ విభాగంలో ఫిలోమిన్ రాజ్, ఉత్తమ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో సీహెచ్ సాయి అవార్డులు గెలుచుకున్నారు.