శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమలలో సందడి చేసింది. శనివారం ఉదయం జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి స్వామి వారిని దర్శించుకుంది. జాన్వీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు అందించారు. జాన్వీ తరచూ తిరుమలకు వస్తూ ఉంటుంది. తన తల్లి శ్రీదేవికి తిరుమల ఆలయం ఎంతో ఇష్టమైన ప్రదేశం. దీంతో తన కుటుంబంలో ప్రతి ప్రత్యేకమైన రోజు సందర్భంగా జాన్వీ తిరుమలకు వచ్చి పూజలు చేస్తోంది. గులాబీ రంగు లంగా ఓణీలో సంప్రదాయ పద్ధతిలో జాన్వీ ఆకట్టుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదం తింటూ తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. దీనికి హ్యాపీ న్యూ ఇయర్ అనే కోట్‌ను జోడించింది. దీన్ని బట్టి కొత్త సంవత్సరం సందర్భంగా జాన్వీ తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.