ఇటీవల ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ మళ్లీ వర్క్ లో బిజీ అయిపోయింది. పెళ్లి చేసుకొని పట్టుమని పది రోజులు కూడా కాకముందే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ తో కీర్తి బేబీ జాన్ సినిమాలో నటించింది. ఖలీస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచ వాప్తంగా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇక బేబీ జాన్ టీం ప్రమోషన్లలో బిజీ అయ్యింది.కీర్తిసురేశ్ ఇటీవలే ప్రియుడు ఆంథోని తటిల్ తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇక కొత్త పెళ్లి కూతురు ప్రొఫెషనల్‌గా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటోంది. రెడ్ డ్రెస్‌లో టీంతో కలిసి కనిపించగా.. మెడలో మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.