ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప-2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. పుష్ప-1 హిట్ తో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. సౌత్‌తో పాటు నార్త్ లో కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే జవాన్, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును బద్దలు కొట్టింది. మొదటి 15 రోజుల్లో ఈ సినిమా రూ.1508 కోట్లు వసూళ్లు రాబట్టింది. అత్యధిక వేగంగా ఈ మార్క్ చేరుకున్న చిత్రంగా పుష్ప అరుదైన రికార్డు నమోదు చేసింది. మరికొద్ది రోజుల్లో అమీర్ ఖాన్ దంగల్, బాహుబలి ది కంక్లూజన్ పేర్లతో ఉన్న రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.