టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ తండేల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటించిన ఈ సినిమాను చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ మేకర్స్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 2న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నట్లు ప్రకటించారు. పుష్ప సినిమా విడుదల సమయంలో సంథ్య థియేటర్‌లో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.