ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతేడాది కన్నా ఎక్కువ పండినట్లు రైతులు సీఎం కు వివరించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రావాలని, ఇందులో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల వారీగా ఉత్పత్తి అయిన ధాన్యం వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర తదితరులున్నారు.