మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పోలీస్ యాక్ట్ 30ని అమలు చేయనున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా డిసెంబర్ 2 నుంచి జనవరి 1 వరకు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, ధర్నాలు చేయకూడదన్నారు. నిషేధిత ఆయుధాలతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా జన సమూహం కారాదని, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించకూడదని సూచించారు.