సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తూ ఆయన పోస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. ‘‘సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆయన పేర్కొన్నారు.