తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. దసరా అంటే మందు, మాంసానిదే హవా. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈసారి కూడా మందుబాబులు పండగ గట్టిగానే చేసుకున్నారు. దసరా సందర్భంగా పది రోజుల వ్యవధిలో వెయ్యి కోట్లకు పైగా తాగేశారు. గత పది రోజుల్లో రూ.11 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. బార్లు, వైన్స్ , పబ్బుల్లోనూ అమ్మకాలు పెరిగాయి. రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకు రూ.2,838 కోట్ల అమ్మకాలు జరగగా, అక్టోబర్ ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల మొదటి పది రోజుల్లోనే17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయాయట. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్‌లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.