తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాఫిక్ అసిస్టెంట్స్ పోస్టుల కోసం శిక్షణ పొందిన ట్రాన్స్ జెండర్లు నేడు విధుల్లోకి చేరనున్నారు. హైదరాబాద్‌లో నేటి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల పాటు శిక్షణ అందించారు. సమాజంలో ట్రాన్స్ జెండర్లు ఎంతో వివక్షకు గురవుతున్నారని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని, ప్రజలతో మమేకమయ్యేలా చేయాలని వారికి తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.